గ్రీన్ ఛాలెంజ్ మాలో స్పూర్తి నింపింది: టివీ నటుల సంఘం

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం ఉద్యమంలా సాగుతున్నది. ఆర్టిస్ట్స్ అసోషియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (ఎఎటీవీ) సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. డా.వినోద్ బాల, విజయ్ యాదవ్, కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్ ఎంసీ పార్క్ లో జరిగిన కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ గ్రీన్ ఛాలెంజ్ లో పాల్గొన్న ప్రతి టీవీ కళాకారుడూ మూడు చెట్ల చొప్పున నాటి తిరిగి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించాలని పిలుపునిచ్చారు.


ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎఎటిటి సభ్యులు, టీవీ ఆర్టిస్టులు లోహిత్, శ్రీహరి, భార్గవ, శశాంక, నాగమణి, విజయ్ రెడ్డి, వాజ్పేయ్, క్రుష్ణ కిశోర్, కౌశిక్, ఆరెల్ల, అవినాశ్, అవినాశ్, బాబీ, లహరి, రాం జగన్, శ్రావణ్, రాగ మాధురి, రోహిణి, లక్ష్మిశ్రీ, మరళీ క్రుష్ణారెడ్డి, కళాధర్, రాగిణి, మధు, మురళీక్రుష్ణ, బ్యాంక్ శ్రీను,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా ముందుకు తీసుకువెళ్లాలని ప్రతిజ్ఞ చేశారు. కాగా..గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కిశోర్ లు ఈ కార్యక్రమాన్ని సమన్వయ పరిచి పాల్గొన్న సభ్యులను అభినందించారు.