ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు తీసుకవెళతాం-టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా
టిక్ టాక్ ఇండియా - తెలంగాణ ప్రభుత్వం, ఐటీశాఖ, డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో హోటల్ హరిత ప్లాజాలో టిక్ టాక్ మీద తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్ట్మెంట్ లకు చెందిన ప్రజా సంబంధాల అధికారులకు అవగాహనా కార్యక్రమం జరిగింది. సోషల్ మీడియా పరిధి రోజురోజుకూ విస్తరిస్తున్న సమయంలో ముఖ్యంగా టిక్ టాక్ యూజర్ల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. అనతికాలంలోనే దేశంలో 20 కోట్ల మంది యూజర్లను చేరుకోగలిగింది అంటే టిక్ టాక్ ప్రజలను ఎంతగా ప్రభావితం చేస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు.ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు టిక్ టాక్ ఎంతో చేరువయింది. ఈ సందర్భంగా టిక్ టాక్ సమర్థ వినియోగం, పాలసీ విధానాలు, సురక్షా పద్ధతుల మీద టిక్ టాక్ ఇండియా పాలసీ డైరెక్టర్ నితిన్ సాలూజా, యువరాజ్ వర్క్ షాప్ లో పాల్గొన్నవారికి దిశా నిర్దేశం చేయడం జరిగింది. గత మూడునెలలుగా టిక్ టాక్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో పనిచేస్తోందని తెలిపారు. ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తో పనిచేయడానికి ముందుకు రావడం జరిగిందన్నారు. సామాజిక భాద్యతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలను తమ వంతు భాద్యతగా టిక్ టాక్ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నామన్నారు